JSON Variables

యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు...కేసీఆర్ పాలనలో సాగునీళ్లు

యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు...కేసీఆర్ పాలనలో సాగునీళ్లు


-తెలంగాణ ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీష్ రావు
-ఇల్లంతకుంటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం
-ఒగ్గు డోలు, డప్పుచప్పుళ్లతో ప్రజానేతకు ఘనస్వాగతం పలికిన ప్రజలు
-దారిపొడవునా రసమయన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-రైతుల కళ్ళలో చిరునవ్వులు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
-కాళేశ్వరం నీళ్లతో నెర్రెలుబారిన భూములన్నీ పచ్చటి మాగానులయ్యాయని అన్నారు.

న్యూస్ పవర్ , 6 అక్టోబర్ , ఇల్లంతకుంట :
యాభై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో పంటల సాగుకు చుక్క నీరు లేక రైతులు సాగు చేసిన పంటలన్నీ కళ్ళ ముందే ఎండిపోతుండటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రెండు పంటలకు సాగునీళ్లు ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ ఆర్థిక,  వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మానకొండూర్ ఎమ్మెల్యే,తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తో కలిసి 50 పడకల ఆస్పత్రికి భూమిపూజ, మార్కెట్ కమిటీ భవనం ప్రారంభోత్సభం, వీఓ  భవనం, పల్లె దవాఖాన ప్రారంభం చేశారు.
మహిళలు భోనాలు, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు.వేలాది సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీళ్లు అందించడం జరుగుతుందని అన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు సాగు చేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఉండేవని, కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతుబందు పథకం ద్వారా ఎకరాకు₹10వేల పెట్టుబడి సాయం చేయడం జరుగుతుందని, రైతుభీమా ద్వారా₹5లక్షల సాయం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్నికలు వస్తేనే పగటి బిచ్చగాళ్లు ఓట్ల కోసం ఊర్లలోకి వచ్చి ప్రజలకు దోంగ హామీలు ఇస్తారని...ఈ పగటి వేశగాళ్లను ప్రజలు నమ్మొద్దని అన్నారు.
యాభై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రజలకు ఎం చేసిందని, ఇప్పుడు వారంటీ లేని కొందరు కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీ కార్డు పేరుతో గ్రామాల్లోకి వస్తున్నారని, యాభై ఏళ్లలో ఇవ్వని గ్యారెంటీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశ్యంతో కాంగ్రెస్ దోంగ హామీలు ఇస్తుందని అన్నారు.ఎన్ని ఊసరవెల్లి వేషాలు వేసిన ప్రజలు నమ్మరని....కాంగ్రెస్ నాయకులకు ప్రజలు మరో  సారి కర్రు కాల్చి వాటపెట్టడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు లేక వేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోవడంతో రైతులు  పంట చెల్లలోనే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూశామని, కాంగ్రెస్ హయాంలో కోతల కరెంటు కారణంగా రైతులు రాత్రిళ్ళు పొలాల వద్దనే నిరీక్షించేవారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసిఆర్  వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారని, రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్ళొద్దని పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
వికలాంగులకు₹4016 పెన్షన్ ఇవ్వడంతో పాటు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడికార్మికులు,వృద్ధులకు ₹2016 పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు.
కళ్యాణాలక్ష్మి,షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు₹లక్ష 116 సాయం అందించడం జరుగుతుందన్నారు.



కాంగ్రెస్ విధానం మూడు గంటల కరెంటు, ఉన్న సంక్షేమ పథకాలలో కోత పెట్టడమేనని....కానీ కేసీఆర్ సర్కారు విధానం వ్యవసాయానికి 24 గంటల కరెంటు...ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.

అంగన్ వాడి కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారంతో పాటు, కోడిగుడ్లు, పాలు అందించడం జరుగుతుందని, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవిస్తే ఆడబిడ్డ పుడితే₹13వేలు, మగబిడ్డ పుడితే₹12వేలు అందించడం జరుగుతుందని అన్నారు.

గృహాలక్ష్మి పథకం ద్వారా ఇంటిస్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ₹3లక్షల సాయం అందించడం జరుగుతుందని అన్నారు. 



Post a Comment

0 Comments