JSON Variables

మంత్రి హరీష్ రావు పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం

మంత్రి హరీష్ రావు పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం


•   భారీ స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం
• దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
• భారీ స్థాయిలో తరలిరానున్న ప్రజలు
 • 50 పడకల ఆస్పత్రి భూమిపూజ, ఏఎంసి భవనం, పల్లె దవాఖాన, వీఓ భవనం ప్రారంభం
• బస్టాండ్ ఆవరణలో బహిరంగ సభ
• సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

న్యూస్ పవర్ , 6 అక్టోబర్ , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు  పర్యటనకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంలో 50 పడకల ఆస్పత్రికి భూమిపూజ, మార్కెట్ కమిటీ భవనం, మహిళ సంఘ భవనం, పల్లె దవాఖానలను  మంత్రి  మంత్రి హరీష్ రావు , ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ,  మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ లు ప్రారంభించనున్నారు.


ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభ ఏర్పాట్లను  మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ దగ్గరుండి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి తన్నీరు హారీష్ రావుకి వేలాది సంఖ్యలో మహిళలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.





Post a Comment

0 Comments