JSON Variables

ఆడ బిడ్డలకు కానుకగా బతుకమ్మ చీర - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

ఆడ బిడ్డలకు కానుకగా బతుకమ్మ చీర

- ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్


న్యూస్ పవర్, 7 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వంతడుపుల  , రహీంఖాన్ పేట  గ్రామాల్లో బతుకమ్మ చీరలను సర్పంచ్ లు కట్ట వెంకట్ రెడ్డి, బిలవేని పర్షరాం తో కలిసి చీరలను పంపిణీ చేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుకగా చీరలను అందిస్తుంది అని అన్నారు పేదింటి ఆడ బిడ్డల మొఖంలో చిరునవ్వు చూడాలని కేసిఆర్  ప్రతి ఆడ బిడ్డకి పుట్టింటి కానుకగా చీరలను పంపారు అని అన్నారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కట్ట వెంకట్ రెడ్డి, బిలవేని పర్షరాం , ఉప సర్పంచ్ బత్తిని కావ్య - స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని మల్లయ్య , బీఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నాడి నవీన్  రెడ్డి , ఏనుగుల పర్శరాం, వార్డు సభ్యులు దురుముట్ల శ్రీనివాస్ , యాదగిరి , నరేష్ , మహేందర్, బుచ్చిరెడ్డి , వెంకటేష్ , రమేష్ , పంచాయితీ కార్యదర్శులు సంధ్య , అరుణ , విఓఏ లు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments