JSON Variables

వాట్సప్ లో మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు



వాట్సప్  లో మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు

• సోషల్ మీడియా లో అనుచిత పోస్ట్ లు చేస్తే కఠిన చర్యలు
• గ్రూప్ అడ్మిన్ లు గ్రూపును కంట్రోల్ లో పెట్టుకోవాలి
• ఇల్లంతకుంట ఎస్సై దాస.సుధాకర్

న్యూస్ పవర్ , 7 అక్టోబర్ , ఇల్లంతకుంట :
వాట్సప్  లో మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఇల్లంతకుంట ఎస్సై దాస.సుధాకర్ తెలిపారు.
నిన్న బి ఆర్ ఎస్ నాయకులు ఇల్లంతకుంటలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జై తెలంగాణా, ఎమ్మెల్యే నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఇచ్చిన నినాదాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ లో వీడియో లను పోస్ట్ చేసి , తమ నాయకత్వానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేసి సంఘంలో విద్వేషాలు రెచ్చగొట్టే  చేసి  అవమానించారని తిప్పారం  గ్రామానికి చెందిన దమ్మని బాబు ఇచ్చిన పిర్యాదు మేరకు ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి సుధాకర్ తెలిపారు. 
సోషల్ మీడియాలో  అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఒక్క వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసినా అలాంటి వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్సై దాస సుధాకర్ హెచ్చరించారు.
  ఒక వ్యక్తికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసినా, చట్ట విరుద్ధంగా కులాలు, మతాలు,పార్టీలు,వర్గాల మధ్య విభేదాలు,శత్రుత్వాలు సృష్టించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా గ్రూపులలో పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టాలని,అలాగే గ్రూప్ అడ్మిన్ లు ఆ గ్రూప్ పై పూర్తి నియంత్రణ కలిగి ఎలాంటి చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ తెలిపారు.

Post a Comment

0 Comments