JSON Variables

వాణీనికేతన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వాణీనికేతన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

న్యూస్ పవర్ , 12 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మలను ఉంచి లయబద్దంగా పాటలు పాడుతు బతుకమ్మ, కోలాటలు ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన నీటి కుండిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈసంద్భంగా సంస్కృతి సాంప్రదాయలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపాల్ శ్రీనిధిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments