JSON Variables

తాటి కమ్మల మరుగుదొడ్లతో వినూత్న నిరసన

 తాటి కమ్మల మరుగుదొడ్లతో  వినూత్న నిరసన 

న్యూస్ పవర్ , 12 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేక మహిళలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో తాటి ముట్టలతో మరుగుదొడ్డి ఏర్పాటు చేసి నిరసన తెలిపిన మండల యువజన సంఘాల  బెంద్రం తిరుపతి రెడ్డి అధ్యక్షుడు మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద మండలమైన ఇల్లంతకుంటకు ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి మహిళ  సంఘాల సోదరిమణులు,ఆర్ టీ సి మహిళా కండక్టర్లు, మరియు మందలాల మంది ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలకు,బ్యాంకులకు, మహిళా సంఘాల సమావేశాలకు వివిధ పనులకు వచ్చిన వారికి మరుగుదొడ్లు, మూత్రశాల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పంచాయతీ కార్యదర్శి కి సమస్య చెప్పినా గ్రామపంచాయతీ పాలకవర్గం పైకి సమస్య నెట్టుతూ కాలయాపన చేయడంతో తాటి మట్టలతో మరుగుదొడ్డి ఏర్పాటుచేసి నిరసన  తెలుపుతున్నామన్నారు, వెంటనే మరుగుదొడ్లను ఏర్పాటుచేసి మహిళా ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Post a Comment

0 Comments