JSON Variables

టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణారెడ్డి రాజీనామా

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎంపీపీ ఊట్కూరి వెంకట రమణారెడ్డి రాజీనామా 

న్యూస్ పవర్ , 12 అక్టోబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ఎంపీపీ ఊట్కూరి రమణారెడ్డి బిఅర్ఎస్ పార్టీ ప్రాథమిక  సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల  జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యకు లేఖను పంపించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన 9 సంవత్సరాల కాలంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పథకాలను నేను పూర్తిస్థాయిలో నిర్వహించడం జరిగినది.కానీ గత 3 సంవత్సరాల కాలంగా వారు నాతో వ్యవహరించిన తీరు,పథకాల నిర్వహణలో నా భాగస్వామ్యాన్ని తగ్గించడం పట్ల నేను మనస్థాపంతో ఉన్నాను.గత 5 సంవత్సరాలలో పలుమార్లు దృష్టికి తీసుకు వెళ్ళినప్పటికి తీరు మారనందుకు నిరసనగా,తీవ్రమైన మనస్థాపంతో నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.ఈ 9 సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు,అధికారులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments