JSON Variables

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై కేసు నమోదు

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై కేసు నమోదు

• బెల్టు షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు_ఎస్ఐ సుధాకర్
న్యూస్ పవర్ , 11 అక్టోబర్ , ఇల్లంతకుంట :
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెండు బెల్ట్ షాపుల పైన కేసు నమోదు చేయడం జరిగిందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని రెండు కిరాణా షాపులలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారని సమాచారం మేరకు నిన్న రాత్రి పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మద్యాన్ని అమ్ముతున్న మొగిలోజు.దయాసాగర్ షాపులో నుండి 15 బీర్ బాటిళ్లు మరియు మూడు లీటర్ల మద్యం సీజ్ చేసి అతనిపైన కేసు నమోదు చేయడం జరిగిందని మరియు అదే గ్రామానికి చెందిన బొడిగె.హరీష్ అనే వ్యక్తి వద్ద నుండి 38 బీరు బాటిళ్లు మరియు 6.48 లీటర్ల మద్యం ను సీజ్ చేసి అతనిపై కేసు చేయడం జరిగింది అని ఎస్సై తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఎవరైనా మద్యాన్ని విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ప్రభుత్వ అనుమతి పొందిన వైన్ షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యాన్ని అక్రమంగా విక్రయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అటువంటి వారి సమాచారాన్ని పోలీసువారికి అందించాలని కోరారు. అక్రమంగా మద్యాన్ని విక్రయించిన దయాసాగర్ మరియు హరీష్ లను బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments