JSON Variables

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

న్యూస్ పవర్ , 9ఆగష్టు , ఇల్లంతకుంట :
జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానకోండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ దివంగత ప్రీయతమ నాయకురాలు శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ  యువత రాజకీయాల్లో రావడానికి 1960 ఆగస్టు 9 వతారీఖున స్థాపించడం జరిగింది.యువత రాజకీయాల్లోకి రావలని యువజన కాంగ్రెస్ లో పని చేసిన నాయకులు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. మానకొండూర్ నియోజకవర్గ ప్రజలందరికి 63వ ఆవిర్భావ దినోత్సవ శుభకాంక్షలు తెలియాజేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి, అంతగిరి బాలపోచయ్య ,మైనర్టీ అధ్యక్షుడు జమాల్ ,పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్, గూడ నరేందర్ రెడ్డి,ఓగ్గు మధు, న్యాత బాబు,వెంకట్ రెడ్డి, కాసుపాక రమేష్, జెట్టి మల్లేషం,మహేందర్ రెడ్డి,జెరిపోతుల కుమార్,సంతోష్ బాబు,అజ్మత్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments