JSON Variables

గృహలక్ష్మి పథకానికి గడువు పెంచాలి

గృహలక్ష్మి పథకానికి  గడువు పెంచాలి

న్యూస్ పవర్ , 8 ఆగష్టు , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళులేని నిరుపేద కుటుంబాలకు కాలీజాగా ( ఇంటి స్థలం ) ఉన్నవారికి ఇళ్ళుకట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం పేరున 300000/-  రూ"లు ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషం అని తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల జాక్  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్  అన్నారు  కానీ దరఖాస్తు చేసుకోవడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం చాలా బాధాకరం, తక్కువ సమయంలో గృహలక్ష్మి పథకానికి ఇళ్లు లేని నిరుపేద ప్రజలు కావలసిన ధ్రువీకరణ పత్రాలు లేనందున దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, అర్హులైన పేద ప్రజలకు గృహలక్ష్మి పథకం గురించి తెలుసుకోవడానికే సమయం పడుతుంది, నాలుగు రోజుల ముందు ప్రకటించి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం  సరైన పద్దతి కాదు, వెంటనే గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజులు గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేనియెడల అర్హులైన పేద ప్రజలను ఏకం చేసి వారి పక్షాన దళిత సంఘాల అధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామణి హెచ్చరించారు.

Post a Comment

0 Comments