JSON Variables

రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలి

రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలి  

• గొర్రెల పంపిణీ కొరకు అప్పు తెచ్చి డీడీలు కట్టి సుమారు 6 నెలలు
• గొర్రెల పంపిణీ ప్రారంభించాలి లేకుంటే 1,75,000 డీడీలు కట్టిన వారి ఖాతాలో జమ చేయాలి 
• ఎన్నికలు సమీపిస్తున్న వేళ గొర్రెల పంపిన జరుగుతుందొ లేదా అని ఆందోళన 
• గొల్ల కురుమల జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు నూనె శ్రీనివాస్
 

న్యూస్ పవర్ , 29 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో జిల్లా నాయకులు నూనె శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గొల్ల కురుమ యాదవ సోదరులు రెండో విడత గొర్రెల పంపిణీ కొరకు డీడీలు కట్టి సుమారు 6 నెలలు గడుస్తుందనీ ఇంతవరకు గొర్రెల పంపిణీ  ప్రారంభించలేదు అన్నారు మా గొల్ల కురుమ సోదరులు అప్పులు  తెచ్చి 43.750 రూ డీడీలు కట్టడం జరిగింది  రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే గొర్రెల పంపిణీ ప్రారంభించాలి లేకుంటే 1,75,000 డీడీలు కట్టిన వారి ఖాతాలో జమ చేయాలని అన్నారు ఎలక్షన్లు దగ్గర పడడంతో రెండో విడత గొర్రెల పంపిణీ జరుగుతుందా లేదా  కట్టిన డిడి డబ్బులు వస్తాయో రావో అని భయాందోళనలో మా గొల్ల కురుమ సోదరులు ఉన్నారనీ కావున ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించి  వెంటనే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించాలని గొల్ల కురుమల పక్షాన ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment

0 Comments