JSON Variables

ఓటరు జాబితాలో పౌరులు తమ పేర్లను నమోదు చేయాలి

 ఓటరు జాబితాలో పౌరులు తమ పేర్లను నమోదు చేయాలి


ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు
18 సంవత్సరాలు నిండిన, అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయేవారు నమోదు చేసుకోవాలి
- జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అనురాగ్ జయంతి

న్యూస్ పవర్ , 25 ఆగస్టు , రాజన్న సిరిసిల్ల :
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారందరూ, అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే పౌరులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. 

ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26, ఆగస్టు 27, సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక క్యాంప్ నిర్వహించే సమయంలో సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని, ప్రజలు ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.




లోకల్ యాడ్స్ 

Post a Comment

0 Comments