JSON Variables

గృహ లక్ష్మి పథకానికి గడువు పెంచాలి

గృహ లక్ష్మి పథకానికి గడువు పెంచాలి

న్యూస్ పవర్, 10 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రము లో విలేకర్ల సమావేశంలో మానకొండూర్ నియోజక వర్గ బిజెపిఅసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి.గృహ లక్ష్మి పథకం పేరుతో ₹3లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషకరమని కానీ దరఖాస్తులు చేసుకోవడానికి 3 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వైన్స్ షాపులకు 15 రోజుల గడువు ఇచ్చి గృహ లక్ష్మి పథకంనకు 3రోజుల గడువు ఇవ్వడం తో ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు గృహలక్ష్మి పథకానికి ఇల్లు లేని నిరుపేద ప్రజలు కావలసిన ధృవీకరణ పత్రాలు లేనందున దరఖాస్తు చేసుకోడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని అర్హులైన పేద ప్రజలకు గృహ లక్ష్మి పథకం గురించి తెలుసు కోవడానికి సమయం పడుతుంది అని అన్నారు కేవలం 3రోజుల గడువు ఇచ్చి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరియైన పద్ధతి కాదని వెంటనే గృహ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 15 రోజుల గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Post a Comment

0 Comments