JSON Variables

దేశ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతుంది "తెలంగాణ మోడలే"

దేశ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతుంది
 "తెలంగాణ మోడలే"




- సమైక్య రాష్ట్రంలో బోరు వేస్తే నీళ్ళు పడతాయో లేదో అనే దుస్థితి నుంచి వడ్లు ఆరబోసుకునెందుకు స్థలం లేని స్థితికి చేరుకున్నాం.

- JPS,VRA లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సీఎం కేసీఆర్ గొప్ప మనసుకు నిదర్శనం
- ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు 

------------------------------------------------------------ 
సిరిసిల్ల 10, ఆగస్ట్  2023
-------------------------------------------------------------
సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 ఎండ్ల సుపరిపాలన 
 "తెలంగాణ మోడల్ " దేశ సమస్యలకు పరిష్కారం మార్గం చూపడమే కాదు ....భవిష్యత్తు సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు చూపుతుందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 345 మంది VRA ల రెగ్యులరైజేషన్ తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను, 59 మంది జూనియర్ పంచాయితీ సెక్రటరీ ల రెగ్యులరైజేషన్ ఉత్తర్వులను
ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్ బాబు , జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ లు , అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, బి సత్య ప్రసాద్ లతో కలిసి అందజేశారు.


ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


పే స్కేల్ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులై, ఆర్డర్స్ తీసుకుంటున్న VRA, జూనియర్ పంచాయితీ సెక్రటరీ  లకు అందరికీ శుభాకాంక్షలు.

ఎమ్మెల్యే లు, స్థానిక ప్రజా ప్రతినిధులం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటానని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం తో పాటు సుపరిపాలన జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. వీటితో పాటు విప్లవాత్మక భూ సంస్కరణలు సిఎం కేసిఆర్ తీసుకువచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే  ప్రభుత్వం కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని అన్నారు. 

70 ఎండ్ల క్రితం తమ తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు తో పోరాటం చేసిన వ్యక్తులు కూడ సాదా బైనామా క్రింద కొనుగోలు చేసిన భూములకు తెలంగాణ  ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. దీనిని బట్టి సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూ సమస్యల పరిష్కారం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా రైతులకు పంట పెట్టుబడి సహాయంగా
రైతు బంధు పథకం క్రింద ఇప్పటి వరకూ 73 వేల కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతుల ఖాతాలో జమ చేసిందన్నారు. 

సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో బోరు వేస్తే నీరు పడుతుందో లేదో అనే దుస్థితి నుంచి స్వరాష్ట్రం తెలంగాణలో వడ్లను ఆరబోసేందుకు స్థలం లేని స్థితికి వచ్చామన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేసిన వారికి లోతు పాతులు, మంచి చెడ్డలు కులంకషంగా పరిశీలించే అలవాటు సహజంగానే ఉంటుందని...
ప్రధాన డిపార్ట్మెంట్ లకు కేటాయించిన వీఆర్ఏలు మంచి పని కనబరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.



*జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ...*

నిన్నటి వరకు జిల్లాలోని గ్రామాలలో గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) గా విధులు నిర్వహించిన 345 మంది విఆర్ఏ లను ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 81 ద్వారా వారి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఆఫీసు సబార్డినేట్, హెల్పర్ లు మరియు వార్డు మెంబర్లు గా సిఎం కేసిఆర్  నియమిస్తూ  చారిత్మాత్మక నిర్ణయాన్ని తీసుకుందన్నారు.
 తెలంగాణ వస్తే ఏమోస్తుంది అని ఎద్దేవా చేసిన వారికి, అభివృద్దిని ఆచరణ సాధ్యంగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తుందని అన్నారు.  అర్థకాలితో బ్రతికినా ఫరవాలేదు, కాని ఆత్మగౌరవంతో ఉండాలనే తెలంగాణ ప్రజలు జీవిస్తారని,  గ్రామంలో ఏం జరిగిన అందరికంటే ముందు అక్కడ ఉండే విఆర్ఏలు తెలుస్తుందని, వీఆర్ఏ లు నిర్లక్ష్యానికి, నిరాదారణకు, చీదరింపులకు గురికాకుడదని. సమానత్వం రావాలి, అందరు ఆత్మగౌరవంతో సగౌరవంగా బ్రతకాలని, విఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేసి వారివారి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో ఉద్యోగాల్లో నియమించడం జరిగిందన్నారు. జూనియర్ పంచాయితీ సెక్రటరీ లను కూడ ప్రభుత్వం రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ ఉపతనానికి నిదర్శనం అన్నారు. 
ప్రభుత్వ నిర్ణయంతో వీఆర్ఏలు జూనియర్ పంచాయతీ సెక్రెటరీ టుమారో అనంతపూర్ వెలుగులు నిండుతాయన్నారు రెగ్యులర్ అయిన ఉద్యోగులు తమ విధి నిర్వహణను నిక్కచ్చిగా పాటిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు.

*చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ మాట్లాడుతూ...* రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలతో పాటు జూనియర్ పంచాయితీ సెక్రటరీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ  ప్రభుత్వం జీవో విడుదల చేసిందని  అన్నారు. 

ఇల్లు కట్టుకోవడం ఓ కల కాగా....ప్రభుత్వ ఉద్యోగం సాధించడం జీవితకాల స్వప్నం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం లో వీఆర్ఏలు ,జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారన్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ ఊరికే ఉద్యమాన్ని చేపట్టలేదని తెలంగాణ ప్రాంతం నుంచి తరలిపోతున్న ఉద్యోగాలు, నీళ్లు, నిధులను అడ్డుకునేందుకే ఉద్యమాన్ని చేపట్టి సఫలీకృతమయ్యారన్నారు. ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రంలో 1 లక్షా 34 వేల ఉద్యోగాలను ఇప్పటివరకు ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు.  ఇంకా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం జారీ చేసిందన్నారు.  దేశంలో ఎంతోమంది సీనియర్ సిఎం లు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ లాగా గొప్ప నిర్ణయాలు తీసుకోలేదు అన్నారు.  రైతుబంధు,  దళిత బంధు లాంటి గొప్ప పథకాలు దేశంలో మరెక్కడ అమలు కావడం లేదన్నారు. ఉద్యమ నాయకుడే సీఎం కావడం వల్లే తెలంగాణ ప్రాంత ప్రజల ఎండ్ల నాటి స్వప్నాలు సాకారం అవుతున్నాయన్నారు. 
65 ఏళ్లలో చేపట్టని ఎన్నో గొప్ప పనులను 9 ఎండ్ల తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అమలు చేసి చూపారన్నారు.

 
సమావేశంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవి, ఎంపీపీలు ,జడ్పిటిసిలు ,వీఆర్ఏల అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments