JSON Variables

సిరిసిల్ల మినీ స్టేడియం, వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు

సిరిసిల్ల మినీ స్టేడియం, వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు


 న్యూస్ పవర్, 11 ఆగస్టు , రాజన్న సిరిసిల్ల:
తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అకాడమీ, సిరిసిల్ల మినీ స్టేడియంలో 14 సం. ల నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న తెలంగాణ రాష్ట్ర స్థానిక బాలురకు వాలీబాల్ క్రీడలో ప్రవేశాలకై రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల యొక్క శారీరక మరియు క్రీడ నైపుణ్యాన్ని పరీక్షించి ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి, ఎ. రాందాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారు తెలిపారు. 19-08-2023 నాడు స్థానిక సిరిసిల్ల మినీ స్టేడియంలో ఉదయం 9.00 గంటలకు ఎంపికలు నిర్వహించబడును.

అర్హతలు: 1. తేది: 01-08-2007 నుంచి 1-08-2009 మధ్య జన్మించి ఉండాలి. 2. 14 సం. ల నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న బాలుర సెం.మీ. ఉండాలి.

ధ్రువ పత్రాలు: జనన ధ్రువీకరణ పత్రం, స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ 6 ( ఒరిజినల్ & జిరాక్స్ ) తీసుకరావలెను.

రాష్ట్ర స్థాయి చాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం అర్హులైన క్రీడాకారులు నేరుగా సంబంధిత ధ్రువ పత్రములతో (original & Xerox) మరియు టీషర్ట్, నిక్కర్ & షూ వేసుకొని 19-08-2023 నాడు మినీ స్టేడియం, సిరిసిల్లాలో ఉదయం 9.00 గంటలకు హాజరు కావలెను. ఇతర వివరములకై 9440239783 ని సంప్రదించగలరు. ఎంపికైనవారికి ఉచిత భోజనం, శిక్షణా మరియు వసతి సదుపాయం ఉంటాయి.


Post a Comment

0 Comments