JSON Variables

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది


న్యూస్ పవర్ , 10 ఆగస్టు , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కేవలం ఒక వర్గం కోసం ఎంఐఎం పార్టీని సంతృష్టి  పరిచేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలకు దళితుడిని బలి తీసుకుందని ద్వజమెత్తారు, ఫారూక్ అనే వ్యక్తి దళితులు అయిన సోలాంకి విజయ్ భార్య భవానిని వేధింపులకు గురి చేయగా 20రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు కాగా సదరు వ్యక్తి ఫారుక్  విజయ్, భవాని గార్లకు పలు బెదిరింపులకు గురి చేస్తూ గర్భవతి అయిన భవాని గారి పొట్టపై గ్రానెట్ రాయి వేసి చంపుతా అంటూ విజయ్ గారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తమపై జరిగిన దాడి విషయమై విజయ్, భవాని గార్లు పోలీస్ అధికారులను ఆశ్రయించగా వారు బిఆర్ఎస్,ఎంఐఎం నాయకుల ఒత్తిడితో 
సదరు అధికారులు పట్టించుకోకపోవడంతో  మనస్థాపానికి గురి అయిన  విజయ్  గతవారం అదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా వారం రోజులుగా మృత్యువు పోరాడుతూ నిన్నటి రోజున చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అశువులుబాసిన విజయ్ ఆత్మహత్య పూర్తిగా ప్రభుత్వ హత్యగా పరిగణిస్తూన్నామని, దళితుల పట్ల కపట ప్రేమ కాకుండా నిజమైన ఆదరణ ఉంటే వెంటనే ఫారుక్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని విజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని యెడల బాధిత దళిత కుటుంబ పక్షన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి,మండల ప్రధాన కార్యదర్శి తిప్పరపు శ్రవణ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న,బీజేవైఎం మండల అధ్యక్షులు పుణ్ణి సంపత్,పట్టణ అధ్యక్షులు గంగం అనిల్,వజ్జెపల్లి శ్రీకాంత్,మండల అధికార ప్రతినిధి పుణ్ణి రాజు,ఒరగంటి చింటూ, దుర్ముట్ల ప్రశాంత్, మామిడి శ్రీకాంత్ లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments