JSON Variables

సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలు

సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలు

న్యూస్ పవర్ , 10 ఆగస్టు , రాజన్న సిరిసిల్ల జిల్లా:
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశములమేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్  అనుమతితో, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి అధ్వర్యంనుండి అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది. సివిల్ సర్విసెస్ టోర్నమెంట్ 2023-24 - నుండి సంవత్సరం ఎంపికలకు, జిల్లా . రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనుటకు, సిఫారసు చేయుటకు ఈ నెల 10 మరియు 11 వ తారీఖు సాయంత్రం వరకు ఈ క్రింద తెలుపబడిన ఆటలలో జిల్లా స్థాయిలో నైపుణ్యత గల ఉత్సాహవంతులైన ప్రభుత్వ ఉద్యోగ శ్రీడాకారులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అథ్లెటిక్స్(పు/స్త్రీ), బాస్కెట్ బాల్ (పు/స్త్రీ), షటిల్ బాడ్మింటన్ (పు/స్త్రీ), క్రికెట్ (ు), చెస్(పు/స్త్రీ), క్యారమ్ (పు/స్త్రీ), ఫుట్ బాల్(ప్పు), హాకీ(ప్పు/స్త్రీ), కబడ్డీ (పు/స్త్రీ), బాన్ టెన్నిస్(పు/స్త్రీ), పవర్ లిఫ్టింగ్(పు/స్త్రీ), స్విమ్మింగ్ (పు/స్త్రీ), టేబుల్ టెన్నిస్(పు/స్త్రీ), వాలి బాల్(పు/స్త్రీ), వెయిట్ లిఫ్టింగ్ (పు/ స్త్రీ), రెజ్లింగ్ & గ్రీకో రోమన్ (పు), మరియు బెస్ట్ ఫిజిక్ (పు),కావున ఆసక్తి గల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్ధులు తేది: 16-08-2023 రోజున సాయంత్రం 5.00 గం||ల లోపు జిల్లా యువజన మరియు క్రీడా శాఖా అధికారి కార్యాలయములో హాజరు కాగలరని మరియు ఇట్టి ఎంపికలకు హాజరు అయ్యే వారికీ ఎలాంటి టియే మరియు డియే లు చెల్లించబడవు, అని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ. రాందాస్  ఒక ప్రకటనలో తెలిపారు.



Post a Comment

0 Comments