JSON Variables

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

న్యూస్ పవర్, 14జూలై , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో పి.హెచ్. సి  డాక్టర్ శరణ్య తో కలిసి ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ శుక్రవారం నాడు ఫ్రై డే - డ్రై డే కార్యక్రమం లో భాగంగా ఇంటింటికీ తిరిగి నీళ్ళు నిల్వ వుండకుండ , వర్షాకాలం లో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటకు పలు సూచనలు చేశారు,
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను మనమే పరిశుభ్రం గా ఉంచుకోవాలని అన్నారు, ఇంటి పక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని అన్నారు, నీరు నిల్వ ఉన్నట్లయితే అందులో లార్వా తయారయ్యి డెంగ్యూ వైరస్ , మరియు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని అన్నారు, అందుకే ప్రభుత్వం ప్రతి శుక్రవారం నాడు డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు , ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించిన కూడా మనమే మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ శరణ్య, పంచాయితీ సెక్రటరీ అరుణ , హెచ్ ఈ ఓ వెంకట రమణ ,సూపర్వైజర్లు నయీం , జోహార్ , ఏ ఎన్ ఎం జ్యోతి , ఆశా కార్యకర్తలు పద్మ , విజయ,సౌమ్య , అంగన్వాడీ కార్యకర్తలు పద్మశ్రీ , విజయలక్ష్మి , రజిత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments