JSON Variables

ప్రజల రక్షణ,భద్రత కోసమే పోలీస్

ప్రజల రక్షణ,భద్రత కోసమే పోలీస్

---ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పెట్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.

---అనుమానితుల సమాచారం పోలీసులకు అందించాలి.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని,అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం అని స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ అన్నారు.
ఈ రోజు ఉదయం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పెట్ గ్రామంలో 60 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు,01ఆటో,01 ట్రాక్టర్, సీజ్ చేసి సరైన పత్రాలు చూపించి తీసుకవేళ్ళవచ్చు అన్నారు..
ఈ సందర్భంగా డిఎస్పీ రవికుమార్  మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత కోసమే పోలీసింగ్ ఉందని,గ్రామాల్లో కొత్త వ్యక్తులు,నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని,యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో కి గంజాయి మూలాలు రాకుండా చేసుకోవలసిన బాధ్యత గ్రామ ప్రజలాదే అని అలాంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు.. 
గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.గ్రామాల్లో బెల్ట్ షాప్ లు నిర్వహించి అక్రమంగా మద్యం అమ్మితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు..సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు.గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ లు రాజేష్,మహేష్, వెంకటేశ్వర్లు,లక్ష్మారెడ్డి,ఆర్.ఎస్.ఐ లు రమేష్, జునైద్, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments