JSON Variables

రెండో విడత కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

రెండో విడత కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు
 న్యూస్ పవర్, 4 మే , ఇల్లంతకుంట :
  ఇల్లంతకుంట మండలం ఆనంతారం, కిష్రావు పల్లి, గ్రామలో  రెండవ విడత కంటి వెలుగు పరీక్ష శిబిరాన్ని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రారంభించారు,
 ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ అందరహిత సమాజం నిర్మాణం కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు,
ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో,ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను నిర్వహించి వారికి మందులను కళ్ల అద్దాలను అందజేయడం జరుగుతుందన్నారు.ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దనే ముఖ్య లక్ష్యంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలు విధ్వంసం సృష్టించాయని, నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దన్నారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి వారి ఖాతాల్లోనే పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు.
 ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ , ముస్కు మల్లయ్య, ఎంపీటీసీలు తీగల పుష్పలత, స్రవంతి రమేష్, ఉప సర్పంచ్ తిరుపతి యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి లు విజయలక్ష్మి,వార్డ్ సభ్యులు,మచ్చ ప్రభాకర్ , బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యదర్శి ఎలుక రాజయ్య ,ఆశ వర్కర్ లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments