JSON Variables

మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం  చేయాలి

- మార్చి 6న, రాంలీలా మైదానంలో స్త్రీశక్తి పురస్కారాల ప్రధానోత్సవం
-  ఎంపిపి  వుట్కూరి వెంకటరమణారెడ్డి



 న్యూస్ పవర్ , 1 మార్చి , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మాహాత్మానగర్ గ్రామంలోని రాంలీలా మైదానంలో ఈనెల 6న, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహిన్నట్లు  ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకటరమణారెడ్డి  తెలిపారు,
తన కార్యాలయంలో  మండల అధికారులు,ప్రజాప్రతినిధులతో కలసి  ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు,
 ఈ సంధర్బంగా ఎంపిపి  మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదని కొనియాడారు, 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా సామాజిక సేవా, కళా విశిష్ట సేవలందించిన మానకొండూర్ నియోజకవర్గంలోని మహిళా మూర్తులకు స్త్రీ శక్తి పురస్కాలను ప్రధానం చేసి ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు,
 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా   ఎమ్మెల్సీ శ్రీమతి కవిత, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  హాజరవుతారని వివరించారు,
 అదే విధంగా టివి యాంకర్ ఉదయభాను, శివపార్వతి, తోపాటు ప్రముఖ సీరియల్ నటీమణులు హాజరు కానున్నారని, గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు,
 ఈ వేడుకలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మామిడిసంజీవ్,ఇంచార్టీఎంపిడిఓమీర్జా, మండల పార్టీ అధ్యక్షుడు పల్లే నర్సింహారెడ్డి, ఫాక్స్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి,ఎపిఎంవాణీశ్రీ, ఎంపిటిసిలు, సర్పంచులు, ,సిసిలు, నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments