మహిళా సంఘాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం
- ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్
న్యూస్ పవర్, 21 మార్చి , ఇల్లంతకుంట :
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ అన్నారు, మంగళవారం ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో వడ్డీలేని రుణాల ప్రొసీడింగ్స్ ను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు, ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు, మహిళల అభివృద్ధికి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నారని అన్నారు, వంతడుపుల గ్రామంలో 46 మహిళా సంఘాలకు దాదాపు 8 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల ప్రొసీడింగ్స్ ని మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు, ఈ సందర్భంగా మహిళలు కేసిఆర్ కి , మానకొండూరు శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కి ధన్యవాదాలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అన్నాడి నవీన్ రెడ్డి , సి. సి రాంచంద్రా రెడ్డి , సి. ఏ పద్మ , మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
0 Comments