వడ్డీ లేని రుణాల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
న్యూస్ పవర్, 21 మార్చి , ఇల్లంతకుంట :
గాలిపల్లి గ్రామం జీవనజ్యోతి గ్రామ సంఘం లోని 29 స్వశక్తి సంఘాలకు 2018 నుండి 2020 వరకు రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన వడ్డీ లేని రుణాల ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచ్ వాణి దేవేందర్ రెడ్డి సంఘ లీడర్ లకి పంపిణీ చేయడం జరిగింది. జీవనజ్యోతి వీఓ పరిధిలో 29 సంఘాలకు 7 లక్షల 14 వేల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు. మహిళలు వివిధ జీవనోపాదుల నిమిత్తం బ్యాంకు ల ద్వారా పొందుతున్న అనుసంధాన ఋణాలపై చెల్లించిన వడ్డీ ని ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ వెంకటేశం, వీఓఏ శ్రీలత అధ్యక్షురాలు ప్రమోద మహిళలు పాల్గొన్నారు.
0 Comments