సిపిఎం జన చైతన్య యాత్రను విజయవంతము చేయండి.
- గన్నేరo నర్సయ్య సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు
ఇల్లంతకుంట మండల కేంద్రంలో జన చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26, నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో, సిరిసిల్ల, మరియు వేములవాడలో రాష్ట్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర జరుగుతుందని సిరిసిల్లలో ఉదయము 9, గంటలకు మున్సిపల్ ఆఫీస్ లేబర్ అడ్డ వద్ద బహిరంగ సభ ఉంటుందని అన్నారు దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ క్రమక్రమంగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ ఈ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తుందని దేశంలోని బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తూ దేశంలోని గ్రామీణ ప్రాంతంలో 80 శాతం ప్రజలు పనిచేస్తున్న ఉపాధి హామీ పథకానికి 60 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించడం సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ యాత్ర జరుగుతుందని ప్రజలందరూ పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని అన్నారు సిరిసిల్లలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కావున ఇల్లంతకుంట మండల ప్రజానీకం, కార్మిక వర్గం, రైతంగం, మేధావులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు సావన పెళ్లి రాములు సామ నర్సింహారెడ్డి రాములు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్, జిల్లా నాయకులు సొల్లు సాయి, మండల కార్యదర్శి సూరు అభిషేక్,తిప్పారపు బాను,ఎద్దు వెంకటేష్,చింటూ, వంశీ,ప్రశాంత్,అభి పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
0 Comments