JSON Variables

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు


ఇల్లంతకుంట:
మహిళల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలోని 28 మహిళా సంఘాలకు  2లక్షల 45677 వడ్డీ లేని రుణాలు రాగా ప్రాసీడింగ్ పత్రాలను శనివారం  మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలని లక్ష్యంతో బ్యాంకు ల ద్వారా కోట్లాది రూపాయల రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా  తీర్చిదిద్దదానికీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 

తెలంగాణలోని ఆడబిడ్డలందరికి సీఎం కేసీఆర్ వడ్డీలేని రుణాలను అందజేయడం జరుగుతుందని అన్నారు. 

 మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ఆదేశాలతో మండలంలోని అన్నీ గ్రామాల్లో మహిళా సంఘ భవనాలను నిర్మాణం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం  మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా చూస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో  సర్పంచ్ చల్ల నారాయణ, ఎంపీటీసీ తీగల పుష్పలత ఏఎంసి ఛైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, ఇల్లంతకుంట ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్, ఏఎంసి వైస్ చైర్మన్ చందన్, వీఓఏ రాజశ్రీ, వీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments