JSON Variables

బ్యాంకు ల ద్వారా తీసుకున్న ఋణాలపై చెల్లించిన వడ్డీ రాయితీ(వీఎల్ఆర్) పంపిణీ

బ్యాంకు ల ద్వారా తీసుకున్న  ఋణాలపై చెల్లించిన వడ్డీ రాయితీ(వీఎల్ఆర్) పంపిణీ 
 న్యూస్ పవర్ , 10 మార్చి , ఇల్లంతకుంట :
ఈరోజు ఆదర్శ మండల సమాఖ్య కార్యాలయంలో మహిళా స్వశక్తి సంఘాలు బ్యాంకు ల ద్వారా తీసుకున్న అనుసంధాన ఋణాలపై చెల్లించిన వడ్డీ రాయితీ(వీఎల్ఆర్) పంపిణీ చేయడం జరిగింది, 2018-19 మరియు 2019-20 రెండు ఆర్థిక సంవత్సరాలకి సంబంధించి మండలం లోని 46 గ్రామ సంఘాలు 965 స్వశక్తి సంఘాలకు గానూ 1.71 (ఒక కోటి డెబ్బైఒక్క లక్షల రూపాయలు) మంజూరు కావడం జరిగింది. వీటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ని ఈరోజు ఎంపీపీ రమణారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు  గ్రామ సంఘాల అధ్యక్షులు, వీఓఏల కి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ  మాట్లాడుతూ క్రమశిక్షణ తో కట్టుబాట్లతో మీరంతా మహిళా సంఘాలు నిర్వహించుకుంటున్న తీరు అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధి లో పాలకవర్గం తో పాటు అత్యధికంగా క్రుషి చేస్తు భాగస్వాములవటం చాలా మండల పరిషత్ పక్షాన అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వేణు  మాట్లాడుతూ హరితహారం , పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర మహిళలదేనని సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రవికుమార్, ఎంపీడీవో మీర్జా, ఎంపీటీసీ వొగ్గు నర్సయ్య యాదవ్ , ఏపీయం లు రాకేష్, వాణిశ్రీ, సీబీఓ ఆడిటర్లు ఆంజనేయులు, రాజు , హరికృష్ణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు వనజ, మమత సీసీలు రాంచంద్రారెడ్డి, వెంకటేశం, శంకర్, సదయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments