JSON Variables

పంటల లక్ష ఋణ మాఫీ చేయాలనీ తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేసిన మండల బీజేపీ నాయకులు

పంటల లక్ష ఋణ మాఫీ చేయాలనీ  తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేసిన మండల బీజేపీ నాయకులు

 న్యూస్ పవర్ , 10 మార్చి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల  పంటల  లక్ష ఋణ మాఫీ చేయాలనీ ధర్నా చేసిన మండల బీజేపీ నాయకులు
తెలంగాణా రాష్టంలో రైతుల పంట ఋణలను మాఫీ చేస్తానని  ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్ర శేఖర్ రావు గ హామీ ఇచ్చి రెండవసారి గద్దెనెక్కి 4 సంవత్సరాలు గడిచిపోతున్న  రైతుల పంట రుణాలు మాఫీ చేయకపోవడంతో  నమ్మిన రైతుల పంట ఋణం ఈ నాలుగేళ్లులో అప్పు రెట్టింపు 2 లక్షలు అయింది, ఇప్పుడు రైతులు ఎం చేయాలో అర్ధం కానీ పరిస్థితి బ్యాంకు అధికారులు అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు కట్టాల్సిందే మీరు కెసిఆర్ మాఫీ చేస్తాడనుకొని నమ్మి పంట ఋణం చెల్లించకపోవడం మీ తప్పు అంటున్నారని , తక్షణమే తెలంగాణా రాష్ట్రము లోని రైతుల పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలనీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కేసిఆర్ ని  ఇల్లంతకుంట తహసీల్దార్ ద్వారా డిమాండ్ చేస్తున్నానామాన్నారు, ఈ నిరసన కార్యక్రమంలో  బెంద్రం. తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు, ఇట్టిరెడ్డి.లక్ష్మారెడ్డి మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు, బీజేపీ నాయకులు రొండ్ల.మధుసూదన్ రెడ్డి, బండారి.రాజు,దేశెట్టి.శ్రీనివాస్, మామిడి.హరీష్, పున్ని.సంపత్, పున్ని.రాజు, కృష్ణ, శ్రీనివాస్, తిరుపతి, మహేందర్, అశోక్, తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments