JSON Variables

డబుల్ బెడ్ రూం ఇండ్ల అందజేత పై స్పష్టత ఇవ్వాలి

డబుల్ బెడ్ రూం ఇండ్ల అందజేత పై స్పష్టత ఇవ్వాలి

  రాజన్న సిరిసిల్ల జిల్లా:
ఇల్లంతకుంట మండలంలో నిర్మించి ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే అర్హులకు అందించాలని అదేవిధంగా ఇంటి ఖాళీ స్థలాలు కలిగి ఉన్నవారికి ఐదురూక్షల రూపాయల ఇళ్ల నిర్మాణానికి అందించాలని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని, ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేనటువంటి స్థితిలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తామని తెలిపింది. మండలంలో ఇల్లు, ఇంటి స్థలాలు లేని వారు చాలా మంది ఉన్నారని కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడ కూడా అమలు కావడం లేదని ఆరోపించారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి అయి ఐదు సంవత్సరాలు గడుస్తున్న లబ్ధిదారులకు  అందించలేకపోవడంతో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పలుమార్లు వినతిపత్రాలు, నిరసనలు నిర్వహించినప్పటికీ డబుల్ బెడ్ రూం లు ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత రావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం లు, ఇంటి ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments