దోపిడీ పీడణలపై రణభేరి మ్రోగించిన అణబేరి.
న్యూస్ పవర్ , 14 మార్చి , ఇల్లంతకుంట :
ఈరోజు ఇల్లంతకుంట మండలకేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపెల్లికి చెందిన అనబేరి ప్రభాకర్ రావు, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తూపాకులు ఎక్కుపెట్టి దోపిడీ పీడణలపై రణభేరి మ్రోగించినారు.
కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు తోపాటు 12 మందిని నైజాం సర్కారు మార్చి 14 -1948 నాడు హుస్నాబాద్ మండలం ముహమ్మదాపూర్ గుట్టల్లో
అతికిరాతకంగా కాల్చి చంపింది.
ఈ సందర్భంగా వీరోచితంగా పోరాడి అమరులైన వారందరికీ పేరుపేరునా జోహార్లు అర్పించారు.
......... కరపత్రం ఆవిష్కరణ.........
అణబేరి తో పాటు ఎన్కౌంటర్ లో మరణించిన ఇల్లంతకుంట మండలం లోని సోమారంపేట గ్రామానికి చెందిన ఐరెడ్డి భూంరెడ్డి,పోరెడ్డి చంద్రారెడ్డి,మూడపెల్లి ఎల్లయ్య,రేపాక రొండ్ల మాధవరెడ్డి,గాలిపెల్లి కి చెందిన ఇల్లెందుల పాపయ్య అమరులు కాగా..సోమారంపేట కు చెందిన పోరెడ్డి రాంరెడ్డి,ఒక తూపాకి తూటాతగిలిన తరువాత మహమ్మదాపూర్ ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్నారు.( ఐదు సంవత్సరాల క్రితం అమరులైనారు.)పై అమరవీరుల స్థూపాలను ఇల్లంతకుంట మండలం లోని సోమారంపేట, రేపాక తాళ్లపెల్లి, గాలి పెల్లి లో గ్రామాల్లో నిర్మంచడంకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నరు,
కా,,మంద సుదర్శన్ సిపిఐ జిల్లా నాయకులు.
కా,,సామల్ల మల్లన్న రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు.
కా,, అమీనా బేగం మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కా,, గజ్జెల లక్ష్మి కా,, కుర్రు ఎల్లవ్వ, మల్లేశం రాజు తదితరులు పాల్గొన్నారు.
0 Comments