JSON Variables

రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయండి

రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయండి 

 న్యూస్ పవర్ , 1 మార్చి , ఇల్లంతకుంట :
ఈ నెల 3వ తారీఖున మానకొండూర్ నియోజకవర్గంలో ప్రవేశస్తున్న హత్ సే హత్ జోడో పాదయాత్ర ను విజయవంతం చేయాలనీ ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  పాదయాత్ర బి ఆర్ ఎస్ బి జె పి పార్టల అవినీతి అరాచకలను ప్రజలకు వివరిస్తూ ఎస్సి ఎష్టి బిసి మైనార్టీ ప్రజల మరియు విద్యార్థుల కష్టాలను తెలుసుకుంటూ వారికి ఓదార్పును ఇస్తూ ఈ దోపిడీ ప్రభుత్వలు ఏ విధంగా మోసం చేస్తున్నాయో ప్రజలకు వివరంగా చెప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఏ పథకలు ఇస్తాయో చెప్పి ప్రజలకు భరోసా నిస్తూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు ఈ పాదయాత్రలో రైతులు విద్యార్థులు యువకులు కార్మికులు కర్శకులు మేధావులు కార్మికులు కవులు కళాకారులూ అందరు వేల సంఖ్యలో పాల్గొనాలన్నరు ప్రజా వ్యతిరేక విధానాల ప్రభుత్వలకు కండ్లు తెరిపించాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్ల కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు చిట్టి ఆనంద రెడ్డి ,యువజన కాంగ్రస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మాజీ మండల అధ్యక్షుడు పసుల వెంకన్న,పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ ,మండల యస్సి సి సేల్ అధ్యక్షులు మచ్చ రాజేశం, మైనర్టీ అధ్యక్షుడు జమాల్ , గూడ నరెందర్ రెడ్డి ,సింగిరెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments