JSON Variables

వాణీనికేతన్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు

వాణీనికేతన్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు
 న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంటః ఇల్లంతకుంటలోని వాణీనికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .పాఠశాల ఆవరణలో మంగళవారం విద్యార్థులు తయారు చేసిన 83 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈసందర్భం కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. మానవజాతి పురోగతికి మూలం సైన్స్ అన్నారు. రామన్ ఎఫెక్ట్ రూపుదాల్చిన రోజును సైన్స్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని విద్యార్థులకు వివరించారు. స్థానికంగా లభించిన వాటిని వినియోగించి ప్రాజెక్టులు రూపొందించడం అభినందనీయం అన్నారు. ఈసందర్బంగా విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, సైన్స్ టీచర్లు మద్దికుంట తిరుపతి, సౌజన్యలతో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments