JSON Variables

గాలిపెల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన వోరగంటి

గాలిపెల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన వోరగంటి

 న్యూస్ పవర్ , 14 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ రెడ్డి   సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా వారిని కలిసి ఘనంగా సన్మానించారు, అనారోగ్యంతో బాధపడుతున్న తూర్పు కిరణ్ ని పరామర్శించారు గతంలో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొరకు వైద్యులతో మాట్లాడి స్వయంగా రెండు మూడు సార్లు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వైద్యాన్ని సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నారు,అదే విధంగా ఆస్పత్రి యందు అయిన ఖర్చులనిమిత్తం ఈరోజు ఆయనకు 50,000/- రూపాయల సీఎం సహాయనిధి చెక్కును ఆయనకు అందించారు,
సీఎంఆర్ఎఫ్  చెక్కు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి మరియు సహకరించిన మంత్రి వర్యులు  హరీష్ రావు కి, కేటీఆర్ కి,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు  బోయినపల్లి వినోద్ కుమార్ కి,రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు,
ఈ సందర్భంగా తన అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకున్న ఆనంద్ కి కిరణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ ప్రజలు ఆయనను అభినందించారు,
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మల్లుగారి వాణి దేవేందర్ రెడ్డి , బిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments