JSON Variables

ధరణి వల్ల రెవిన్యూ లో అనేక ఇబ్బందులు పడుతున్న బాధితులు


 ధరణి వల్ల రెవిన్యూ లో అనేక ఇబ్బందులు పడుతున్న బాధితులు

 న్యూస్ పవర్, 13 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
తెలంగాణ దళిత సంఘాల జాక్ జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలములోని దళితులు భూముల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు, గ్రామ రెవిన్యూ అధికారులు విధుల్లో ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఒకరి భూములు ఒకరికి రికార్డ్ లో తారుమారు చేయడం తో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణాలు చేసిన కనికరించని రెవిన్యూ అధికారులు, భూముల సమస్యల దళిత కుటుంబాల బాధితులు అనేక సార్లు దరఖాస్తులు  ఇవ్వడానికి వెళ్లిన అధికారులు ధరణి అమలు నుండి కార్యాలయం లో దరఖాస్తులు తీసుకోవడం లేదని బాధితులను వెళ్లగొట్టడంతో వారికి ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితి లో ఉన్నారు వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దళితుల యొక్క భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేనియెడల పరిష్కరించేంతవరకు బాధితులను ఏకం చేసి ధర్నాలు రాస్తారోకోలు చేపడుతామణి హెచ్చరించారు.

Post a Comment

0 Comments