JSON Variables

బిఅర్ఎస్ పార్టీకి సావనపెల్లి రాకేష్ రాజీనామా

బిఅర్ఎస్ పార్టీకి సావనపెల్లి రాకేష్ రాజీనామా 
 
జనం న్యూస్ , 6 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
బిఅర్ఎస్ పార్టీ కార్మిక విభాగం  మానకొండూర్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సావనపెల్లి రాకేష్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మానకొండూర్ నియోజకవర్గం లోని అన్ని వర్గాల నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న  చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు  మానకొండూర్ శాసనసభ్యులు  రసమయి బాలకిషన్  బి అర్ ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అందరిని ఒకే ల చూడకుండా డబ్బులు ఉన్నవారిని మాత్రమే గౌరవిస్తూ నిరుపేద కార్యకర్తలను చిన్న చూపు చూస్తూ పట్టించుకోకపోవడం చాలా బాధా కరమణి అన్నారు, బూర్జవ రాజకీయ పార్టీ లలో ఉంటూ గులాంగిరి చేయడం వల్ల పేద ప్రజల బ్రతుకులు మారవణి అన్నారు,కేవలం ప్రజా పోరాటాల ద్వారానే అన్ని వర్గాల పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలుపుతూ.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  నియోజకవర్గం లోని పేద ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వారి పై కపట ప్రేమ చూపిస్తు విస్మరిస్తున్న తీరుపై బిఅర్ఎస్ కేవి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ కి రాజీనామా చేస్తున్నాను ,  పార్టీ కార్యకర్తలు  చాలా మంది అసంతృప్తి తో ఉన్నారు త్వరలో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Post a Comment

0 Comments