JSON Variables

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్వర్యంలో మొదటి సారి గా ఉచిత పశు వైద్య శిబిరం

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్వర్యంలో మొదటి సారి గా ఉచిత పశు వైద్య శిబిరం 
జనం న్యూస్ , 4 ఫిబ్రవరి, ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రం లో  ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్వర్యంలో మొదటి సారి గా ఉచిత పశు వైద్యశిబిరం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ కార్యక్రమంనికి ముఖ్య అధితులుగా జడ్పీవైస్ ఛైర్మన్ సిద్ధం వేణు ,హాజరై  మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల కు ఉచితం గా టీకాలు, బలం గోలీలు ఇవ్వడం జరిగింది రైతులకు ఏఎంసి  ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగా విషయం గా కొనియాడారు,మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంజీవ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మొదటి దశ ఇల్లంతకుంట ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దశల వారిగా ఆయా గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది కావున రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు,
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు, ఏ ఎం సి  వైస్ ఛైర్మన్ చందన్ ఉప సర్పంచ్ సదుల్, ఏఎంసి  డైరెక్టర్ లు రాజీరెడ్డి, అరెకొమురయ్య, ఒల్లల రవి, ఏ ఎం సి  కార్యదర్శి హరనాథ్ వెటర్నరీ డా. సతీష్, కొప్షన్ సభ్యులు ఎండి .సలీమ్, వార్డు సభ్యులు భాస్కర్, పట్టణ అధ్యక్షులు రఘు, నాయకులు హరికుమార్, శ్రీను, మహేష్, రామకృష్ణ, రైతులు ఏఎంసి  సిబ్బంది, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments