JSON Variables

ఎస్సీ ఎస్టీల ఇండ్లకి ఉచిత కరెంటు ఇవ్వాలి

ఎస్సీ ఎస్టీల ఇండ్లకి ఉచిత కరెంటు ఇవ్వాలి


 న్యూస్ పవర్ , 11 నవంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో  ఎస్సీ ఎస్టీ  ల ఇండ్లకి ఉచిత కరెంట్  ఇస్తానని కేసిఆర్ హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడిచిపోయిన హామీ నెరవేర్చలేదని,ఎస్సీ, ఎస్టీ విద్యుత్ బిల్లులు మాఫీ చేసి ఉచిత విద్యుత్ అందించాలని సెస్ విద్యుత్ వినియోగదారుల సేవా సదన్ ముందుధర్నా చేసిన మండల బీజేపీ నాయకులు,
తెలంగాణా రాష్ట్రములో  ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు  ఎస్సీ ఎస్టీ ల ఇండ్లకు 101 యూనిట్లవరకు ఉచిత కరెంట్ ఇస్తానని మాట ఇచ్చి తప్పినందుకు ఇల్లంతకుంట సెస్  కార్యాలయం ముందు ధర్నా చేస్తూ బెంద్రం.తిరుపతి రెడ్డి మండల బీజేపీ అధ్యక్షులుమాట్లాడుతూ.. రాష్టంలో  దళిత, గిరిజన షెడ్యూల్డ్ కులాల వారి గృహ వినియోగానికి 101 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని సీఎం కెసిఆర్ తేది 25-08-2018 రోజున హామీ ఇస్తే నమ్మిన నా రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత, గిరిజన ప్రజలను మోసం చేసినాడు, కెసిఆర్ మాట నమ్మి విద్యుత్ బిల్లులు కట్టకపోతే ఇప్పుడు సెస్ ఎన్నికల్లో పోటి చేయారకుండాఐపాయే, కనీసం ఓటు వేసే హక్కు లేకుండా అర్హత కూడా తీసేస్థిరని ఈ పాపం మీదే కాదా అని మండిపడ్డారు, ముఖ్యమంత్రి కుమారుడైనా జిల్లా మంత్రి కేటీఆర్  కి సవాల్ చేస్తున్నా  మీ నాన్న  ఇచ్చిన హామీ 51 నెలలైనా నెరవేర్చులేదు  కనీసం మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  ఎస్సీ, ఎస్టీ ల ఇండ్ల కరెంట్ బిల్లులు మాఫీ చేసి, వాళ్ళకి సెస్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించి, నేటి రోజు నుండైనా ఉచిత కరెంట్ అందిస్తే  మేము ఇల్లంతకుంట మండల సెస్ డైరెక్టర్ గా బీజేపీ పార్టీ నుండి పోటీ చేయమన్నారు,మాకు పదవులు కాదు షెడ్యూల్డ్ కులాల సంక్షేమామే ముఖ్యమన్నారు. ఈ ధర్నాలో  బీజేపీ నాయకులు బొల్లరం.ప్రసన్న, గజ్జల.శ్రీనివాస్, దండవేణి. రజినీకాంత్, బండారి.రాజు, ఎలుక.రామస్వామి, మామిడి. హరీష్, వజ్జపెల్లి. శ్రీకాంత్, సూదుల.కిషన్ ,దాచారం.తిరుపతి, సుదగోని. శ్రీకాంత్, పయ్యావుల.నవీన్, అంతటి. వేణు, బొంగోని.శ్రీనివాస్, పున్ని. ప్రశాంత్, పొట్ల.వెంకటేష్, కేశవేణి. భూమేష్, నర్సయ్య, రాములు పాలుగోన్నారు.



లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments