JSON Variables

జిల్లా స్థాయి చెకుముకి సంబరాలకు రహీం ఖాన్ పేట మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక

జిల్లా స్థాయి చెకుముకి సంబరాలకు రహీం ఖాన్ పేట మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక 

న్యూస్ పవర్ , 24 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట ఆదర్శ పాఠశాల లో జన విజ్ఞాన వేదిక అద్వర్యం లో నిర్వహించిన మండల స్థాయి చెకు ముకి పోటిల్లో తెలంగాణ మోడల్ స్కూల్-రహిమ్ ఖాన్ పేట విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం విభాగం లో ఉత్తమ ప్రతిభ చూపారు, స్కూల్ నుండి 8 వ తరగతి విద్యార్థిని సాహితి, 9 వ తరగతి విద్యార్థి మనోజ్, 10 వ తరగతి విద్యార్థిని నిహారిక లు జిల్లా స్థాయి కి  ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ మధుకర్  తెలిపారు, వీరు ఈ నెల 27 న రంగి నేని ట్రస్ట్ సిరిసిల్లా లో జరిగే జిల్లా స్థాయి పోటీలకు మన ఇల్లంత కుంట మండలం కు ప్రాతి నిత్యం వహించ నున్నట్లు,జిల్లా స్థాయి లో కూడా ఉత్తమ ప్రతిభ చూపి మన మండలం కు  పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు, ఈ సందర్భంగా విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ వెంకన్న , సైన్సు విభాగం హెచ్ ఓ డి మురళి కృష్ణ  అభినందించారు,
   ఈ కార్యక్రమంలో మండల బాద్యులు నిషాని మహేందర్ , సైన్సు ఉపాధ్యాయులు వెంకన్న,విజయ్ కుమార్,నర్సయ్య,కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments