JSON Variables

ఎటు తేలని సహకార సంఘం లెక్కలు

ఎటు తేలని సహకార సంఘం లెక్కలు

  న్యూస్ పవర్  , 27 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఈరోజు సహకార సంఘం ఆవరణలో సహకార సంఘ పాలకవర్గ సభ్యురాలు గన్నేరం వసంత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
 గత వారం రోజుల క్రితం సహకార సంఘ సీఈఓ కి రాతపూర్వకంగా లెక్కలు సమర్పించాలని కోరగా వారు స్పందించి లెక్కలు ఇవ్వడం జరిగింది కానీ అందులో ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేవని కొనుగోలుకు సంబంధించి పూర్తిగా వారు ఇచ్చిన లెక్కలన్నీ తప్పుగా ఉన్నాయని పదివేల క్వింటాళ్లు వడ్లు కొనుగోలు చేసిన సెంటర్లో లెక్కలు చూస్తే లక్షల్లో ఉన్నావని అలాగే 25 30 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసిన  కాడ వేళల్లో ఖర్చులు ఉన్నాయని సహకార సంఘ అధ్యక్షులు మరియు సీఈఓ ను కోరగా అందుకు వారు సరైన సమాధానం చెప్పడం లేదని తక్కువ కొనుగోలు చేసిన సెంటర్లో ఎక్కువ ఖర్చులు చూపించి మరి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు అనేది ఎలాంటి సమాచారం లేదని దీనిపై ఎన్నోసార్లు వివరణ కోరగా ఒకసారి కరోనా ఉంది అని మరొకసారి వడ్ల కొనుగోలు తర్వాత లెక్కలు సమర్పిస్తామని తీరా సంవత్సరం తర్వాత ఇచ్చినటువంటి లెక్కలు దేనికి పొందన లేవని దీనికి సంఘ అధ్యక్షులు మరియు సి ఈ ఓ బాధ్యతగా సమాధానం చెప్పడం లేదని సహకార సంఘ సభ్యులకు ఇచ్చిన లెక్కలే ఈ విధంగా ఉంటే ప్రభుత్వానికి సమర్పించే ఆడిట్ ప్రతి సంవత్సరం ఇచ్చే నివేదిక ఇంకా ఎన్ని తప్పులు జరుగుచున్నావో అని అన్నారు పై విషయాలు పురస్కరించుకొని జిల్లా సహకార అధికారికి త్వరలోనే ఫిర్యాదు చేయనున్నట్లు అన్నారు గత పాలకవర్గం ఆస్తులు సంపాదిస్తే ఇప్పుడున్న అధ్యక్షులు మరియు సీఈఓ తప్పుడు లెక్కలు చూయిస్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు సహకార సంఘం లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఇతర శాఖల ద్వారా ఆడిట్ చేపిస్తే లక్షలాది రూపాయలు కుంభకోణం బయటకు వస్తుందని అన్నారు ఇకనైనా సహకార సంఘ పరిధిలో ఉన్న రైతులందరూ మరియు పాలకవర్గ సభ్యులు సహకార సంఘ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ మేల్కొని సంఘంలో జరుగుతున్న అక్రమ లెక్కలన్నీ బయట పెట్టడం కోసం కలిసి రావాలని కోరారు.

Post a Comment

0 Comments