JSON Variables

ప్రపంచ ఆహార వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న వోరగంటి

ప్రపంచ ఆహార వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న వోరగంటి

న్యూస్ పవర్,16 అక్టోబర్ 
ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆహార వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ సభ్యుడు శ్రీ వోరగంటి ఆనంద్  పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ వనరుల లో చాలా ముఖ్యమైనది ఆహారం.ఏదైనా జీవి జీవించాలంటే ఆహారం తప్పనిసరిగా ఉండాలి.కల్తీ ఆహారం వలన, సరైన పౌష్టికాహారం లేక ఇంకా కొన్ని కుటుంబాలు రోగాల బారిన పడి పేదరికంలోనే ఉంటున్నాయి.  మన భారతదేశానికి స్వాతంత్ర్యo వచ్చినప్పటి నుండి చాలా ప్రభుత్వాలు చాలా పథకాలు తెచ్చినప్పకి ఇంకా పౌష్టిక లేమితో బాధపడుతూ పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండటం లేదు.ప్రపంచ లెక్కల ప్రకారం భారతదేశం లో  ఇప్పటికి 52% డెలివరీ కి యోగ్యత లేని భాదితులు ఉన్నారు. పేదరిక నిర్మూలన పోవాలంటే సరైన పౌష్టికాహారం ప్రతీ పేదవాడికి అందించడమే సరైన మార్గం అని ప్రజలందరికీ ఆహార  దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కమీషనర్ శ్రీ అనిల్ కుమార్ ,మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి దివ్య ,ఆహార భద్రతా కమీషన్ చైర్మన్ శ్రీ తిరుమల్ రెడ్డి ,కమీషన్ సభ్యులు,ఇతర ఉన్నతాధికారులు ,రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ముఖ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments