JSON Variables

మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది

 మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్  గారికే దక్కుతుంది
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
 న్యూస్ పవర్ , 30 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఈ రోజు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్  మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు  రసమయి బాలకిషన్  ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన తూముల బాలయ్య రెండు నెలల క్రితం విద్యుత్ షాక్ తో మరణించిగ ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు సెస్ నుండి 5లక్షల రూపాయల చెక్కును అందజేశారు..అనంతరం గాలిపెల్లి గ్రామంలో సుమారు 80,000/-రూ!! సీఎం రీలీప్ ఫండ్ చెక్కులనుఅందజేశారు,
ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి అన్న పూర్ణ ప్రాజెక్ట్ లో  సుమారు 5లక్షల ఉచిత చేప పిల్లలను  వదిలి,గాలిపెల్లి గ్రామంలో బతుకమ్మ తెప్పెను ప్రారంభించినారు,

అనంతరం రసమయి _మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి దేనని అన్నారు. కేసిఆర్ గారి ప్రత్యేక చొరవ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో_ _కళకళలాడుతుందని వివరించారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా , ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోందన్నారు, తెలంగాణ లో ఎక్కడా చూసిన ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కళ్ళ ముందు కనబడుతుతుందని వెల్లడించారు. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి చేపలను ఉత్తర భారతం తో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్  అన్ని కులవృత్తుల వారికి పెద్ద పీట వేస్తూ ఆర్థికంగా ఎదగటానికి ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రము ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత తీయటంతో అవి జలకళ సంతరించుకున్నాయి అని అన్నారు.గతంలో చేపల కోసం ఆంధ్ర మీద ఆధారపడే వాళ్ళం...కానీ నేడు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో  మృత్స సంపద పెరిగందని అన్నారు,
చేపల మార్కెటింగ్ కు ఔట్ లెట్లు,ద్విచక్ర వాహనాలు,ఫోర్ విల్లర్  వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.

Post a Comment

0 Comments