JSON Variables

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ
- ఎంపిపి  వెంకటరమణారెడ్డి
 న్యూస్ పవర్ , 30 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ అని  ఎంపిపి  వుట్కూరి వెంకటరమణా రెడ్డి  అన్నారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఏర్పాట్లలో ఆయన 
ఈ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ పండగని కొనియాడారు.ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రకృతితో మమేకమై జరుపుకునే గొప్ప పండగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన పండగని పేర్కొన్నారు. ప్రకృతి ఒడిలో విరబూసే తీరొక్క పూలను తెచ్చి, ఎంతో భక్తి శ్రద్దలతో బతుకమ్మ ను పేర్చి అందరితో కలసి ఆడుతూ పాడుతు సంతోషం గా జరుపుకునే మన పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం వాణీశ్రీ, సర్పంచులు గోడిశేల జితేందర్ గౌడ్,జూనియర్ సహాయకులు సూర్య, చంద్రారెడ్డి, కుమార్ యాదవ్, కార్యదర్శులు, ఐకేసి సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments