ఇందిరా మహిళా శక్తి'తో మహిళల ఆర్థికాభివృద్ధి - సర్పంచ్ మామిడి రాజు
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (NRLM) ద్వారా ఇల్లంతకుంట లో నూతనంగా ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకల యూనిట్లను సర్పంచ్ మామిడి రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోందని తెలిపారు. ఈ రుణాలను ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకుని, కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగానే ఇలాంటి యూనిట్ల ఏర్పాటు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ముష్కానిపేటలో జరిగిన కార్యక్రమంలో ఉపసర్పంచ్ లావణ్య, వార్డు సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ పూర్ణ చంద్రిక మాట్లాడుతూ యూనిట్ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
కార్యక్రమంలో ఏపీఎం చెన్నబోయిన కుమారస్వామి, మండల సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య, వీఓ ఓబీలు సఫియా, సుమలత, సీసీలు రామచంద్రారెడ్డి, వెంకటేశం, విఠల్ రెడ్డి, వీఓఏలు వినోద, రాజు తదితరులు పాల్గొన్నారు.

