ఇల్లంతకుంటలో 21 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 21 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి క్వింటాకు రూ. 2389/- మద్దతు ధరను పొందాలని పిలుపునిచ్చారు. రైతుల సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో నీడ, మంచినీరు మరియు కనీస వసతులు కచ్చితంగా కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఎం.ఆర్.ఓ సురేష్, ఏ.పీ.యం కుమారస్వామి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సౌమ్య పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఏ.ఎం.సి డైరెక్టర్లు, జీ.పీ.ఓ లు, ఏ.ఈ.ఓ లు, సీసీలు, వీ.ఓ.బీ లు, వీ.ఓ.ఏ లు, కమిటీ సభ్యులు, హమాలీలు, రైతులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

