గురుకుల ఫలితాల్లో తాళ్ళళ్ళపల్లె ఎంపీపీఎస్ విద్యార్థుల ప్రతిభ: ఘనంగా సన్మానించిన పేరెంట్స్ కమిటీ
న్యూస్ పవర్, 23 ఏప్రిల్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల పరిధిలోని తాళ్ళళ్ళపల్లె ఎంపీపీఎస్ (MPPS) పాఠశాలలో ఈరోజు ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్ సందడి నెలకొంది. ఇటీవల వెలువడిన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీట్లు సాధించిన విద్యార్థులను, వారికి వెన్నంటి ఉండి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు నూనె శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రాబోయే రోజుల్లో వారు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి , గ్రామ సర్పంచ్ మీసాల కనకరాజు, ఉపసర్పంచ్ గొర్ల కమలాకర్ యాదవ్ వార్డు సభ్యులు కోలుపుల సందీప్, కమల్ల కవిత, గొర్ల శ్రీకాంత్ యాదవ్, నూనె కేత శ్రీనివాస్ యాదవ్, అంగన్వాడి టీచర్ స్వప్న, మహిళా అధ్యక్షురాలు మీసాల లీల, గుర్రాల రాజయ్య, కమల్ల శ్రీనివాస్, కమల్ల రాములు, చందు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

