ఉపాధి పథకం పేదలకు ఒక భరోసా
న్యూస్ పవర్ , 5 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
పనుల కొలతల్లో ఎటువంటి తప్పులు జరగకుండా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కు సర్పంచ్ జుట్టు శేఖర్ ,టెక్నికల్ అసిస్టెంట్ పుష్పలత సూచించారు .గురువారం ఇల్లంతకుంట మండల పరిధిలోని పతికుంటపల్లి గ్రామంలో అమలవుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ ,టెక్నికల్ అసిస్టెంట్ ప్రత్యక్షంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక భరోసా. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఉపాధి కూలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ,పని ప్రదేశంలో కూలీలకు కచ్చితంగా నీడ సౌకర్యం కల్పించాల్సిందిగా ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనులు కూలీలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా చేపడుతున్న ఉపాధి హామీ పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.
