• సుమారు 80 పశువులకు చికిత్స, ఉచిత మందుల పంపిణీ
న్యూస్ పవర్ , 5 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
డి.ఎల్.డి.ఏ ఆధ్వర్యంలో వంతడుపుల గ్రామంలో గురువారం పాడి పశువులకు ప్రత్యేక గర్భకోశ వ్యాధి నివారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి పాడి రైతుల నుండి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా పశు వైద్యాధికారిణులు గ్రామంలోని సుమారు 80 పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స అందించారు. అనంతరం రైతులకు పశువుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పాడి రైతులు ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి, ఉపసర్పంచ్ గంగా చారి, డైరీ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, పశు వైద్యాధికారిణులు డాక్టర్ ఇందిరా, డాక్టర్ పూర్ణచంద్రిక, గోపాలమిత్ర సూపర్వైజర్ రాములు, గోపాలమిత్ర రంజాన్ మరియు పాడి రైతులు పాల్గొన్నారు.
