నాలుగు నెలలుగా జీతాలు అందక విధుల బహిష్కరణ: ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత
న్యూస్ పవర్,6 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
గత నాలుగు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇల్లంతకుంట మండలంలోని ఈ-పంచాయతీ మరియు గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గురువారం తమ విధులను తాత్కాలికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కి మరియు మండల పంచాయతీ అధికారి కి ఆపరేటర్లు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ-పంచాయతీ ఆపరేటర్లు ధనుజ్ కుమార్, రమేష్, నరేష్, చంద్రశేఖర్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
