ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం..
న్యూస్ పవర్ , 6 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం గ్రామంలోని చొప్పరి వారి గుండ్ల వద్ద పనులు ప్రారంభించి అర్హులైన ప్రతి కూలీకి పని దొరికేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఉపాధి హామీ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు.గ్రామంలో చేపట్టే పనులు నాణ్యతతో పూర్తి కావడం అత్యంత ప్రాధాన్యమని,కూలీలకు సమయానికి వేతనాలు అందేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులు పారదర్శకంగా అమలు కావాలని సంబంధిత సిబ్బందికి,ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణకు సూచించారు.ఉపాధి హామీ పనులను గ్రామ కూలీలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి,ఉపసర్పంచ్ కదం జయంత్,వార్డ్ సభ్యులు మల్యాల రాజశేఖర్, చొప్పరి సాయిలు,పీటర్,అక్కేమ్ ఉపేందర్,రమేష్,గోనెపల్లి లావణ్య వెంకటేష్ గ్రామ ప్రజలు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
