ఆపదలో ఉన్న స్నేహితురాలికి బాసటగా నిలిచిన పూర్వ విద్యార్థులు
- భర్తను కోల్పోయిన మిత్రురాలికి రూ. 25,300 ఆర్థిక సాయం
- మానవత్వం చాటుకున్న రేపాక 2007 బ్యాచ్ మిత్రబృందం
న్యూస్ పవర్ ,6 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
కష్టకాలంలో ఉన్న తమ చిన్ననాటి స్నేహితురాలికి తోటి విద్యార్థులు అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇల్లంతకుంట మండలం, రేపాక గ్రామానికి చెందిన 2007 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇదే గ్రామానికి చెందిన, తమ తోటి విద్యార్థిని గుండెజారి శ్యామల భర్త ఇటీవల మరణించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న 2007 బ్యాచ్ మిత్రులందరూ చలించిపోయారు. తమ స్నేహితురాలికి మనోధైర్యాన్ని కల్పిస్తూ, ఆర్థికంగా చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా మిత్రులందరూ కలిసి సేకరించిన రూ. 25,300 (ఇరవై ఐదు వేల మూడు వందలు) మొత్తాన్ని గురువారం శ్యామల కుటుంబానికి అందజేశారు. కష్టసమయంలో స్నేహితులు ఆదుకోవడం పట్ల పలువురు గ్రామస్తులు పూర్వ విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అర్చన, బండి సీను, పట్టం తిరుపతి, స్వరూప, శేఖర్, జాగిరి రమేష్, రామలక్ష్మి, నరేష్ రెడ్డి, తడకపల్లి సంపత్, రాచకొండ అనిల్, శ్రీలత, రవళి, గన్నేరం శ్రీనివాస్, అంతగిరి శ్రీకాంత్, మరిజ మణికంఠ, కరుణ, ఆంజనేయులు, అనిత, రేణుక, మంజుల, రాణి, రజిత, రమాదేవి, రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.
