- 150 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించిన మెడికవర్ ఆసుపత్రి
- సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం: సెంటర్ హెడ్ గుర్రం కిరణ్
న్యూస్ పవర్, 6 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇల్లంతకుంట మండలం, సిరికొండ గ్రామంలో గురువారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది.
ఈ శిబిరంలో సుమారు 150 మంది గ్రామస్తులకు బీపీ (BP), షుగర్, ఈసీజీ (ECG), 2D ఎకో (2D Echo) వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలను డాక్టర్ ప్రకాష్ నేతృత్వంలోని వైద్య బృందం ఉచితంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ... స్థానిక ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న సదుద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని రకాల అత్యవసర మరియు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, మెడికవర్ ఆసుపత్రిలో 24/7 సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడుగు విట్టల్, వార్డు సభ్యులు, ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, లక్ష్మీ రాజం, శ్రీకాంత్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
